నిర్మల ధ్యానాలు - ఓషో - 6


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 6 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ప్రేమ సమగ్రమైనది. సంపూర్ణత నిస్తుంది 🍀*

ప్రేమ వున్న మనిషి సమగ్రంగా వుంటాడు కాబట్టి అతనికి సంపూర్ణంగా ఎట్లా జీవించాలో తెలుసు. అతని శరీరం ప్రేమతో నిండి వుంటుంది. అతని శరీరకణాలు ప్రేమతో నాట్యం చేస్తూ వుంటాయి. అతని మనసు ప్రేమతో తొణికిసలాడుతూ వుంటుంది. 

తర్కంతో కాదు ప్రేమతో నిండి వుంటుంది.
అతని హృదయం ప్రేమభరితమై వుంటుంది. అది కేవలం రక్తాన్ని పరిశుభ్రం చేసే ఉపకరణం మాత్రమే కాదు, శ్వాసించే పరికరం మాత్రమే కాదు. అతను ప్రేమని శ్వాసిస్తాడు. ప్రేమని వదులుతాడు. అతని ఆత్మ స్వచ్ఛమైన ప్రేమ. అది ప్రేమ సముద్రం.

అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించడానికి సంసిద్ధుడు. అట్లాంటి వ్యక్తిని కాదని ఉనికి ఎక్కడ దాక్కుంటుంది? నిజానికి అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించాల్సిన పన్లేదు. అస్తిత్వమే అన్వేషించుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. అక్కడున్న సౌందర్యమదే. అస్తిత్వం అన్వేషిస్తూ పరిశోధిస్తూ నిన్ను సమీపించినపుడు అదట్లాగే వుంటుంది. 

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

నిర్మల ధ్యానాలు - ఓషో - 4

నిర్మల ధ్యానాలు - ఓషో - 9