Posts

నిర్మల ధ్యానాలు - ఓషో - 10

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 10 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ *🍀. మనిషి తన సంకల్పాన్ని దాటి వెళ్ళాలి. అప్పుడే తను దైవ సంకల్పంలో భాగమవుతాడు. 🍀* వ్యక్తి తన సంకల్పాన్ని వదులుకోవాలి. అసలు యిబ్బందంతా అక్కడే వుంది. ఒకసారి మన సంకల్పాన్ని వదులుకుంటే అపుడు మన గుండా అస్తిత్వం తన పనిని మొదలు పెడుతుంది. అప్పుడక్కడ బాధ వుండదు. దు:ఖముండదు. అత్యుత్సాహముండదు. ఉద్వేగముండదు. వ్యక్తి సంపూర్ణ విశ్రాంతితో వుండవచ్చు. అక్కడ సమస్యే వుండదు. అన్ని సమస్యలూ నీ సంకల్పం నించే మొదలవుతాయి. సంకల్పమంటే సమస్తానికి వ్యతిరేకంగా సంఘర్షించడం. అది ఘర్షణే. సంఘర్షణ ఆందోళనకి కారణమవుతుంది. అపుడు నీకు వైఫల్యమే ఫలితం.  అందువల్ల ఎంత పెద్దగా ఘర్షించినా ప్రతివాడికీ హృదయపు లోతుల్లో దాని వల్ల ఫలితం వుండదని తెలుస్తునే వుంటుంది. వ్యక్తి సమస్తానికి వ్యతిరేకంగా నిలిచి విజయం సాధించలేడు. సమస్తంలో కలిసి వుంటే మనిషి సాధించగలడు. సమస్తానికి వ్యతిరేకంగా వుంటే ఏమీ సాధించలేడు. ఒకసారి నువ్వు నీ సంకల్పాన్ని వదులుకుంటే అన్నీ నీవే హఠాత్తుగా అనంత విశ్వం నీకోసం తలుపులు తెరుస్తుంది. అన్ని రహస్యాలూ నీకు అవగతమవుతాయి. తెలియనివన్నీ...

నిర్మల ధ్యానాలు - ఓషో - 9

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 9 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ *🍀. అహంకారం ఆవిరి కావడమే సంపూర్ణమైన సమర్పణ 🍀* సంపూర్ణ సమర్పణ వున్నపుడే అస్తిత్వంతో మనకు ఒప్పందం కుదురుతుంది. అంతకు మించి మరో మార్గం లేదు. నీళ్ళు నూరు డిగ్రీల వేడికి ఆవిరయినట్లు మన అహంకారం ఆవిరి కావడమే సంపూర్ణమైన సమర్పణ. ఎప్పుడు నువ్వు కేవలం శూన్యంగా వుంటావో అప్పుడు లోపల ఎవరూ వుండరు అది గొప్ప నిశ్శబ్దం, గొప్ప శాశ్వతత్వం. సరిహద్దులు లేనితనం, ఐతే అక్కడ ఎవరూ లేరు. సమస్త ఆకాశం నీలోకి ప్రవేశించే సందర్భమది.  అది భూమ్యాకాశాల కలయిక. అక్కడ నువ్వు అశాశ్వతత్వం నించీ శాశ్వతమైన ఆత్మగా పరివర్తన చెందుతావు. సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 8

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 8 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ *🍀. మనిషి అస్తిత్వంతో కలిసి వున్నపుడే సజీవంగా వుంటాడు 🍀* మనిషి అస్తిత్వంతో కలిసి వున్నపుడే సజీవంగా వుంటాడు. మన పునాదులు అస్తిత్వంలో వుంటే మనం సంపూర్ణంగా, ఆరోగ్యంగా వుంటాం.  మనం అస్తిత్వ సంబంధం లేకుండా ఒంటరిగా వుంటే, పునాదులు లేకుంటే ఎట్లాంటి ఎదుగూ బొదుగూ లేకుండా ప్రాణం లేకుండా వుంటాం.  అస్తిత్వమన్నది భూమి, మన బలవర్థకమయిన ఆహారం, మన ఆరోగ్యం, సమజీవితం అంటే విస్ఫోటన మినహా మరేం కాదు. అది మన సజీవత్వానికి సంబంధించిన విస్ఫోటన. సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 7

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 7 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ *🍀. నువ్వు ప్రేమిస్తున్నావా? లేదా? అన్నది ముఖ్యం. 🍀* ప్రేమ ప్రచారం చెయ్యకు. ప్రేమ గురించి వివరించకు. సమస్త అస్తిత్వాన్ని ప్రేమించు. అదొక యధార్థం. నిజానికి చెట్లు, పర్వతాలు, మనుషులు వేరు వేరు కాదు. మనం కలిసి భాగస్వామ్యం వహిస్తాం. మనం గాఢమయిన సమశృతిలో వుంటాం.  మనం ఆక్సిజన్ ని పీలుస్తాం. కార్బన్‌ డయాక్సైడ్ ని వదుల్తాం. చెట్లు కార్బన్‌డయాక్సైడ్ ని పీల్చి ఆక్సిజన్ ని వదుల్తాయి. అందు వల్ల చెట్లు లేకుంటే మనం లేము. మనం కలిసి వున్నాం. కలగలిసి వున్నాం. అట్లాగే ఈ అనంత విశ్వం అంతస్సంబంధం కలిగి వుంది.  కాబట్టి ప్రదర్శించకుండా ప్రేమించు. చెట్లని, నక్షత్రాల్ని, పర్వతాల్ని, జనాల్ని, జంతువుల్ని ప్రేమించు. నువ్వు ఎవర్ని ప్రేమిస్తున్నావన్నది విషయం కాదు. నువ్వు ప్రేమిస్తున్నావా? లేదా? అన్నది ముఖ్యం. సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 6

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 6 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ *🍀. ప్రేమ సమగ్రమైనది. సంపూర్ణత నిస్తుంది 🍀* ప్రేమ వున్న మనిషి సమగ్రంగా వుంటాడు కాబట్టి అతనికి సంపూర్ణంగా ఎట్లా జీవించాలో తెలుసు. అతని శరీరం ప్రేమతో నిండి వుంటుంది. అతని శరీరకణాలు ప్రేమతో నాట్యం చేస్తూ వుంటాయి. అతని మనసు ప్రేమతో తొణికిసలాడుతూ వుంటుంది.  తర్కంతో కాదు ప్రేమతో నిండి వుంటుంది. అతని హృదయం ప్రేమభరితమై వుంటుంది. అది కేవలం రక్తాన్ని పరిశుభ్రం చేసే ఉపకరణం మాత్రమే కాదు, శ్వాసించే పరికరం మాత్రమే కాదు. అతను ప్రేమని శ్వాసిస్తాడు. ప్రేమని వదులుతాడు. అతని ఆత్మ స్వచ్ఛమైన ప్రేమ. అది ప్రేమ సముద్రం. అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించడానికి సంసిద్ధుడు. అట్లాంటి వ్యక్తిని కాదని ఉనికి ఎక్కడ దాక్కుంటుంది? నిజానికి అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించాల్సిన పన్లేదు. అస్తిత్వమే అన్వేషించుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. అక్కడున్న సౌందర్యమదే. అస్తిత్వం అన్వేషిస్తూ పరిశోధిస్తూ నిన్ను సమీపించినపుడు అదట్లాగే వుంటుంది.  సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 5

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 5 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ నువ్వు 'దేవుడు' అన్న మాట అన్న క్షణంలోనే అదేదో చాలా దూరంగా వున్న విషయం అన్న స్పృహ కలుగుతుంది. శతాబ్దాల నించే, యుగాల నించీ తరతరాల నుంచీ అందరూ చెబుతున్నది అదే. ఎక్కడో దేవుడు పైన వుంటాడని, ఆకాశంలో మనకందనంత ఎత్తులో వుంటాడని. అదే నువ్వు ప్రేమ' అన్న మాట అంటే అది హృదయానికి చాలా దగ్గర్లో వుంటుంది. నువ్వు 'దేవుడు' అన్న పదాన్ని వుపయోగించిన క్షణం అది నీకు ఒక వ్యక్తికి సంబంధించిన స్పృహ కలిగిస్తుంది. దేవుడికి పరిమితులు ఏర్పడతాయి. దేవుణ్ణి ఫలానా అని వివరించే వీలు ఏర్పడుతుంది.  కానీ ప్రేమ అన్నది వ్యక్తి కాదు. అదొక గుణం, అదొక సామీప్యం, ఒక పరిమళం, దానికి పరిమితి లేదు. హద్దుల్లేవు అది అనంతం. నువ్వు దేవుడు అన్న మాట అంటే నువ్వు నిస్పృహకు లోనవుతావు ఏం చెయ్యాలి అని ? అదే అక్కడ ప్రేమ వుంటే నువ్వు ఏమయినా చెయ్యగలవు.  ప్రేమించడమన్నది నీ లోలోతుల లక్షణం. నీ లోపలి లక్షణం. అందుకనే నా బోధనలన్నీ ప్రేమ అన్న పదం చుట్టూ తిరుగుతాయి. అందరూ దేవుడు అంటే ప్రేమ అన్నారు. నేను! ప్రేమ అంటే దేవుడు అంటాను.  సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 4

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 4 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ నా సలహా ఏమిటంటే ప్రేమ కోసం అన్వేషించడం ఆరంభించు. సూటిగా దైవాన్ని అన్వేషించడం కాదు, ప్రేమను వెతుకు. ఎందుకంటే నువ్వు సూటిగా, సరాసరిగా దేవుణ్ణి అన్వేషిస్తే ఆ దేవుడు నీ ఊహకు సంబంధించిన వాడే అవుతాడు. అతను హిందూ దేవుడు, క్రిస్టియన్ దేవుడు, మహమ్మదీయ దేవుడు అవుతాడు. అతను నిజమైన దేవుడు కాడు. ప్రేమ గుండా అన్వేషించు.. ప్రేమ గుండా సౌందర్య భరితమైంది ఏదయితే వుందో అది ఊహా దేవుడి గుండా వీలుపడదు. ఎందుకంటే ప్రేమ అన్నది ఎట్లాంటి విశేషణాలు లేకుండా ప్రేమే ! ఇది ప్రేమకు సంబంధించిన అపూర్వ విషయం. మానవజాతి తన ఊహలలో వున్న దేవుడికి బదులు ప్రేమను అన్వేషిస్తే ప్రపంచంలో గొప్ప సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుంది. సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹