Posts

Showing posts from March, 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 5

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 5 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ నువ్వు 'దేవుడు' అన్న మాట అన్న క్షణంలోనే అదేదో చాలా దూరంగా వున్న విషయం అన్న స్పృహ కలుగుతుంది. శతాబ్దాల నించే, యుగాల నించీ తరతరాల నుంచీ అందరూ చెబుతున్నది అదే. ఎక్కడో దేవుడు పైన వుంటాడని, ఆకాశంలో మనకందనంత ఎత్తులో వుంటాడని. అదే నువ్వు ప్రేమ' అన్న మాట అంటే అది హృదయానికి చాలా దగ్గర్లో వుంటుంది. నువ్వు 'దేవుడు' అన్న పదాన్ని వుపయోగించిన క్షణం అది నీకు ఒక వ్యక్తికి సంబంధించిన స్పృహ కలిగిస్తుంది. దేవుడికి పరిమితులు ఏర్పడతాయి. దేవుణ్ణి ఫలానా అని వివరించే వీలు ఏర్పడుతుంది.  కానీ ప్రేమ అన్నది వ్యక్తి కాదు. అదొక గుణం, అదొక సామీప్యం, ఒక పరిమళం, దానికి పరిమితి లేదు. హద్దుల్లేవు అది అనంతం. నువ్వు దేవుడు అన్న మాట అంటే నువ్వు నిస్పృహకు లోనవుతావు ఏం చెయ్యాలి అని ? అదే అక్కడ ప్రేమ వుంటే నువ్వు ఏమయినా చెయ్యగలవు.  ప్రేమించడమన్నది నీ లోలోతుల లక్షణం. నీ లోపలి లక్షణం. అందుకనే నా బోధనలన్నీ ప్రేమ అన్న పదం చుట్టూ తిరుగుతాయి. అందరూ దేవుడు అంటే ప్రేమ అన్నారు. నేను! ప్రేమ అంటే దేవుడు అంటాను.  సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 4

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 4 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ నా సలహా ఏమిటంటే ప్రేమ కోసం అన్వేషించడం ఆరంభించు. సూటిగా దైవాన్ని అన్వేషించడం కాదు, ప్రేమను వెతుకు. ఎందుకంటే నువ్వు సూటిగా, సరాసరిగా దేవుణ్ణి అన్వేషిస్తే ఆ దేవుడు నీ ఊహకు సంబంధించిన వాడే అవుతాడు. అతను హిందూ దేవుడు, క్రిస్టియన్ దేవుడు, మహమ్మదీయ దేవుడు అవుతాడు. అతను నిజమైన దేవుడు కాడు. ప్రేమ గుండా అన్వేషించు.. ప్రేమ గుండా సౌందర్య భరితమైంది ఏదయితే వుందో అది ఊహా దేవుడి గుండా వీలుపడదు. ఎందుకంటే ప్రేమ అన్నది ఎట్లాంటి విశేషణాలు లేకుండా ప్రేమే ! ఇది ప్రేమకు సంబంధించిన అపూర్వ విషయం. మానవజాతి తన ఊహలలో వున్న దేవుడికి బదులు ప్రేమను అన్వేషిస్తే ప్రపంచంలో గొప్ప సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుంది. సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 3

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 3 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ జీవితాన్ని గొప్ప సవాళ్ళు చుట్టు ముట్టినపుడే జీవనశక్తులన్నీ ఒకే కేంద్రం నుంచీ వజ్రకాంతుల్లో ధగధగలాడతాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకో. మతాన్ని భయంతో మేళవించకు. మతాన్ని నిర్భయంతో మేళవించు. ధైర్యంతో, సాహసంతో జత కలుపు. అట్లాంటి సాహసం నీకు మార్గ నిర్దేశం చేస్తుంది. అదెలాంటిదంటే అగమ్యగోచరమయిన సముత్రంలో చిన్ని పడవలో ఎట్లాంటి మార్గనిర్దేశం, ఎట్లాంటి చుక్కాని లేకుండా ప్రయాణించడం లాంటిది. అవతలి తీరం గురించి ఏమీ అవగాహన లేని ప్రయాణం. కేవలం భూమి గుండ్రంగా వుందన్న ఒకే ఒక దృష్టి. వ్యక్తి తన చైతన్యరీత్యా కొలంబస్ కావాలి.  సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 2

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 2 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ మనిషికి ప్రేమ గానంగా మారగలిగిన శక్తి వుంది. ప్రేమ నాట్యంగా పరివర్తన చెందగలిగే సామర్థ్యముంది. కానీ కొద్ది మంది, అరుదుగా అతి కొద్ది మంది మాత్రమే అట్లా కాగలుగుతున్నారు. అందరూ విత్తనాలుగా జన్మించారు. కొద్ది మందిని మినహాయిస్తే అందరూ విత్తనాలుగానే చనిపోతున్నారు. నిష్ఫలంగా నీరుగారి పోతున్నారు. నాకు తెలిసినంత మేరకు గుళ్ళకు, మసీదులకు, చర్చిలకు వెళ్ళే జనం ప్రేమతో వెళ్ళడం లేదు. భయం కొద్దీ వెళుతున్నారు. ముసలివాళ్ళు మరీ ఎక్కువ మంది వెళుతూ వుంటారు. కారణం వాళ్ళకు మరణమంటే భయం. వాళ్ళు జీవితంలో ఏదో అపూర్వమయిన దాన్ని అందుకోవటం వల్ల ఆలయాలకు వెళ్ళడం లేదు. మరణమనే చీకటి వాళ్ళను సమీపిస్తుండటంతో భయపడి వెళుతున్నారు. ఏదో రక్షణ కోసం వెళుతున్నారు.  ఇప్పుడు వాళ్ళకు ఒక విషయం తెలిసొచ్చింది. వాళ్ళ డబ్బు వాళ్ళతో బాటు రాదు. స్నేహితులు వెంట రారు. వాళ్ళ కుటుంబం వాళ్ళని వదిలేస్తుంది. అందువల్ల నిరాశతో వాళ్ళు దేవుడనే అభిప్రాయానికి అతుక్కుపోతారు. యిదంతా ప్రేమ వల్ల, కృతజ్ఞత వల్ల కలిగే అభిప్రాయం కాదు. భక్తి కాదు. భయం వల్ల కలిగేది. భయం వల్ల పుట్...

నిర్మల ధ్యానాలు - ఓషో - 1

Image
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 1 🌹* ✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ మానవ చైతన్య చరిత్రలో మనిషి మొదటిసారిగా తన వునికికి సంబంధించిన దారి నుంచే వేరయ్యాడు. దారి తప్పాడు. అందువల్లే ప్రపంచం బాధలు పడుతోంది.  ఇప్పటిదాకా మనుషులు యింతగా ఎప్పుడూ బాధలు పడలేదు. గతంలో జనం పేదవాళ్ళుగా వుండేవాళ్ళు. చాలా నిరుపేదలుగా వుండేవాళ్ళు. ఆకలితో అల్లాడేవాళ్ళు. కానీ ఆధ్యాత్మికంగా ఎప్పుడూ పేదతనం అనుభవించలేదు.  యిప్పుడున్నంత ఆధ్యాత్మిక దారిద్య్రం అప్పుడు లేదు. నా సమస్త ప్రయత్నం మీకు అస్తిత్వానికి సంబంధించిన అంతర్దృష్టిని యివ్వడమే. వునికిలో మనిషి వేర్లు లేకుంటే మనిషికి అస్థిత్వం లేదు !  సశేషం ... 🌹 🌹 🌹 🌹 🌹